* రాబోయే 3 గంటల్లో భారీ గాలులు.. వర్షం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మొంథా తుఫాను తెలంగాణపై కూడా ప్రభావం చూపుతోంది. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ (TELANGANA) వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. హైదరాబాద్(HYDERABAD)లో రాత్రి నుంచీ వర్షం పడుతూనే ఉంది. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వరంగల్ (WARANGAL)తో పాటు పలు జిల్లాలో భారీ గాలులతో పాటు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3 గంటల్లో హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నారాయణపేట, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, పరిసర ప్రాంతాల్లో ఉండొద్దని సూచించింది.
…………………………………………………
