* మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
* మాస్టర్ జీ కాలేజీలో బీసీ ధూందాం సన్నాహక సమావేశం
* 14 మండలాల నుంచి హాజరైన ప్రతినిధులు
* బీసీ జేఏసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుందర్ రాజ్ యాదవ్
* త్వరలో పూర్తి స్థాయి జిల్లా కమిటీ ఎన్నిక
ఆకేరు న్యూస్, వరంగల్: రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం మాస్టర్ జీ కాలేజీ కాన్పరేన్స్ హాల్లో బీసీ జేఏసీ కన్వీనర్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన బీసీ ధూందాం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. బీసీలంతా ఏకతాటిపైకి రాజ్యాధికారం దిశగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అగ్రవరా?లు బీసీలను కులాలవైజ్ గా చీల్చీ వారి పిఠాలు కదలకుండా చూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ఏమైతే వారి పీఠం కదిలే అవకాశం ఉంది కాబట్టే మనల్ని ఏకం కాకుండా విచ్చిన్న రాజకీయాలు, తాయిలాలు ఇస్తూ మనల్ని ఏకం కాకుండా అడ్డుకుంటున్నారని, ఇప్పటికైనా వారి కుట్రలను అర్థం చేసుకోని బీసీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ జనగణన ఒక్కటే పరిష్కార మర్గామని సూచించారు. బీసీ కులాలన్నీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
గ్రామ స్థాయి నుంచే బలోపేతం చేయాలి :
బీసీ జేఏసీ చైర్మన్, మాజీ కుమా చైర్మన్ సుందరాజ్ యాదవ్
జేఏసీ కన్వీనర్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను సాధించాలంటే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీ ఉద్యమం బలపడాలంటే ముందుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ద్రుష్టి సారించాలని అన్నారు. ఆ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్సీటీసీ వరకు అన్నీ బీసీలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా మనం పనిచేస్తే కచ్చితంగా బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగ్రవరా?ల పునాధులు గ్రామాల్లోని వాడల్లోనే ఉన్నాయని, వాటిని అక్కడి నుంచే పెకిలించే పని మొదలు పెట్టాలని, ఆ దిశగా బీసీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓరుగల్లు కేంద్రంగా బీసీ ఉద్యమం:
మాజీ ఓఎస్ డీ, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్
మాజీ ఓఎస్ డీ, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమం పోరాటాల ఖిల్లా ఓరుగల్లు నుంచే ప్రారంభిద్దామని, తెగించి కొట్లాడుదామన్నారు. ఓరుగల్లు కేంద్రంగా బీసీ ఉద్యమం మొదలైందని, దీన్ని ఉధ ృతం చేస్తామన్నారు. బీసీల కోసం బీపీ మండల్, కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ పాత్రను మరువలేమని కొనియాడారు. పార్టీలకతీతంగా బీసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : ప్రముఖ వైద్యులు, డాక్టర్ కాళీప్రసాద్
దేశ వ్యప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కాళీప్రసాద్ అన్నారు. మేం ఎంతా మాకు అంతా అనేవిధంగా మన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం చేయాలని, ఏదైనా పోరాడితే సాధ్యమవుతుంది తప్పా అడుక్కుంటే రాదన్నారు. ఇప్పటికైనా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం ప్రతీ బీసీ కంకణం కట్టుకోవాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు.
బీసీ జేఏసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుందర్ రాజ్ యాదవ్
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంతో పాటు రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లెందుకు రంగం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే జిల్లా బీసీ జేఏసీ రూపుదిద్దుకుంటోంది. సోమవారం జరిగిన బీసీ జేఏసీ ధూందాం కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ గా సుందర్ రాజ్ యాదవ్ ను 14 మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. కో కన్వీనర్లుగా వంగ రవి, వేల్పుల సారంగపాణి, చీకటి ఆనంద్, సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 42 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నకున్నారు. బీసీ ఉద్యమాన్ని మరింత ఉద్రుతం చేయడంతో పాటు గ్రామగ్రామాన బీసీలను ఐక్యం చేస్తూ గ్రామ కమిటీలు, మండల కమిటీల నిర్మాణం కూడా చేయనున్నట్లు నూతన చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థలే గీటురాయిగా పని చేస్తామని తెలిపారు. ఆ ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దానికి అనుగుణంగా బీసీలంతా ఏకతాటిపైకి రావాలని, తమ కమిటీకీ అన్ని విధాల సహాయ సహకరాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో వేణు మాధవ్ గౌడ్, పులి రజినీ కాంత్, నరెడ్ల శ్రీధర్, మునిగాల సమ్మయ్య, కావటి స్వామీ, ఆకారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………