
* రేపటి బీసీ సంఘాల మహాధర్నాకు హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈరోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే, బీసీ మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా వారి వెంట ఉన్నారు. రేపటి బీసీ సంఘాల మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. వీరే కాకుండా, బీఆర్ ఎస్, ఇతర పార్టీల నేతలు కూడా ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఈమేరకే రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ(Delhi)లోని జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎ్సతోపాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిల పక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (RahulGandhi)కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే రేవంత్, భట్టి కూడా ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది.
……………………………………….