* పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం
* ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఒడిశా, బిహార్
* ఏపీకి హోదా అంశాన్ని లేవనెత్తిన వైసీపీ
* అధికారంలో ఉన్నా టీడీపీ హోదా అడగడం లేదు : జైరాం రమేష్ ట్వీట్
ఆకేరు న్యూస్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా (Lok Sabha Speaker Ombirla) నేతృత్వంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం(All Party Meeting today) నిర్వహించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా (Many states have special status) ను డిమాండ్ చేశాయి. కాగా ఏపీ(AP)కి ప్రత్యేక హోదాపై టీడీపీ (TDP) మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలోమ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నేతలు పలు అంశాలను లేవనెత్తారు. ఎన్డీఏ (NDA) కూటమిలో భాగస్వామి అయిన జేడీ(యూ) ఎంపీలు, ఆర్జేడీ ఎంపీలు బిహార్‌కు ప్రత్యేక హోదా (Special Status of Bihar) ఇవ్వాలని డిమాండ్ (Demand) చేశాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతను జేడీ(యూ) నేతలు సమావేశంలో తెలియజేశారు. అలాగే ఒడిశా (Odisha) కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ కోరింది. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభలలో వైసీపీ పక్ష నాయకులు మిధున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. వాళ్లిద్దరూ మాట్లాడుతూ విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అలాగే ఏపీలోని దాడుల అంశాన్ని లేవెనెత్తారు. పార్లమెంట్ లో దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలోమ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiran Rijiju), ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జైరాం రమేష్ ట్వీట్
సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior leader) జైరాం రమేష్ ట్వీట్ (Jairam Ramesh tweet) చేశారు. మిత్రపక్షంలో ఉన్నా టీడీపీ (TDP) ప్రత్యేక హోదా (Special status) ను అడగలేదని విమర్శించారు. జేడీయూ(JDU) మాత్రం తమ రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కోరిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు. అయినా హోదాపై మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
———————