* మృతులందరూ కూలీలే
* కామారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం..
* ఐదుగురు కూలీలకు గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బైపాస్ లో మలుపు తిరుగుతుండగా, డీసీఎం వాహనం ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎంలో ఉన్న ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి పోలీసులు క్షతగాత్రులను తరలించారు. చనిపోయిన వారిని బిహార్ కు చెందిన బీరు బాయ్ (30, సంతోష్ (30), సూరజ్ (18)లుగా గుర్తించారు. గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు సిమెంట్ ట్యాంకర్ వస్తోంది. శంషాబాద్ నుంచి మార్బ్ ల్స్ తో డీసీఎం గుంటూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కామారెడ్డిలో ..
కామారెడ్డిలో కూలీలీతో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో ఐదుగురు కూలీలకు గాయాలు అయ్యాయి. బిక్కునూరు మండలం అంతంపల్లిలో ప్రమాదం జరిగింది. 15 మంది కూలీలతో పొలం పనికి వెళ్లి వస్తున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులను లింగంపల్లి మండలం సూరయ్యపల్లెవాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

