
* కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది?
* టీపీసీసీ మహేశ్‌కుమార్ గౌడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)ను త్వరలోనే అరెస్ట్ అవుతారని, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు బలంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (MAHESH KUMAR GOUD) అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి మంచిగా కొనసాగుతోందని తెలిపారు. తాము ప్రజలకు చేసిన మంచి పనులే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎంపికపై సర్వేలు జరుగుతున్నాయని, వాటిలో ఎవరు ముందుంటే వారికే టికెట్ అని తెలిపారు. అక్టోబర్ నాలుగో తేదీన 22 మంది అబ్జర్వులు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. బీజేపీ (BJP) నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజులనే బీసీ బిల్లును ఆమోదించవచ్చని అన్నారు. కవితది ఆస్తుల పంచాయితీ అని, ఆమెకు, కాంగ్రెస్ కు సంబంధం లేదని అన్నారు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ కు పునరుజ్జీవం లేదని, కేసీఆర్ (KCR) ఇంక ఫామ్ హౌస్ కే పరిమితం అని ఎద్దేవా చేశారు. ఏం చేసి ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేస్తారని విమర్శించారు. హైడ్రాతో సామాన్యులకు ఇబ్బంది లేదని, కబ్జాదారులకే ఇబ్బంది అని తెలిపారు.