* పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రితో పాటు..
* హోం శాఖ మహిళకు..
ఆకేరు న్యూస్, విజయవాడ : ఈ నెల 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడితో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితర 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఎవరికి ఏ శాఖ అనేది రెండు రోజుల తర్వాత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఏ మంత్రులకు ఏ శాఖ అనే ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన హోంశాఖను మహిళకు కేటాయించడం గమనార్హం.
ఎవరికి ఏ శాఖ అంటే..
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం) : పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావణ శాఖ
2. నారా లోకేష్ : ఐటీ, మానవవనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
3. కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయ శాఖ
4. కొల్లు రవీంద్ర : గనులు, ఎక్సైజ్ శాఖ
5. నాదెండ్ల మనోహర్ : పౌరసరఫరాలశాఖ
6. పి.నారాయణ : మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ
7. వంగలపూడి అనిత : హోంశాఖ
8. సత్యకుమార్ యాదవ్ : వైద్య ఆరోగ్యశాఖ
9. నిమ్మల రామానాయుడు : జలవనరుల శాఖ
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ : మైనార్టీ, న్యాయశాఖ
11. ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయశాఖ
12. పయ్యావుల కేశవ్ : ఆర్థికశాఖ, శాసనభ వ్యవహారాలు
13. అనగాని సత్యప్రసాద్ : రెవెన్యూశాఖ
14. కొలుసు పార్థసారధి : గృహ నిర్మాణశాఖ
15. డోలా బాలవీరాంజనేయస్వామి : సాంఘిక సంక్షేమం
16. గొట్టిపాటి రవి కుమార్ : విద్యుత్‌శాఖ
17. కందుల దుర్గేష్ : పర్యాటక, సాంస్కృతికశాఖ
18. గుమ్మడి సంధ్యారాణి : ఉమెన్ అండ్ చైల్డ్, ట్రైబల్ వెల్ఫేర్
19. బీసీ జనార్థన్ రెడ్డి : రోడ్లు, భవనాలు, పెట్టుబడులు
20. టీజీ భరత్ : పరిశ్రమలు, వాణిజ్య, ఆహార
21. ఎస్.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్, టెక్స్ టైల్, వీకర్ సెక్షన్ వెల్ఫేర్
22. వాసంశెట్టి సుభాష్ : లేబర్, ఫ్యాక్టరీస్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్
23. కొండపల్లి శ్రీనివాస్ : ఎంఎస్ ఎంఈ, ఎస్ఈఆర్పీ, ఎన్ ఆర్ ఐ ఎన్పవర్మెంట్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి : రవాణా, యువజన, క్రీడలు
—————————-