Allu Arjun calls Pushpa Saree Look as Alpha Male work
* అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రూల్’ సినిమా ఎన్నో అంశాలతో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సినిమాలో అల్లు అర్జున్ చీరకట్టులో కనిపించిన సన్నివేశం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ లుక్‌పై అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు చేసిన వాటిలో చీరకట్టుకుని మహిళగా నటించడం అత్యంత ‘ఆల్ఫా మేల్’ (అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన బలమైన పురుషుడు ) పని అని ఆయన పేర్కొన్నారు.
* చీర లుక్‌పై ఏమన్నారంటే?
ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. “నేను ఇప్పటివరకు చేసిన వాటిలో అత్యంత ఆల్ఫా పని ఏదైనా ఉందంటే.. అది ఒక మహిళగా నటించడమే. ‘పుష్ప’ సాధించిన విజయం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే స్ఫూర్తిని నాకు ఇచ్చింది” అని అన్నారు.‘పుష్ప’లో తన పాత్రకు సాధారణమైన మాస్, మాచో లుక్ సరిపోవడం లేదని దర్శకుడు సుకుమార్ భావించినట్లు అల్లు అర్జున్ గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ ఈ విభిన్నమైన లుక్‌ను సూచించినట్లు తెలిపారు.
* ‘పుష్ప 2’లో గంగమ్మ జాతర సీక్వెన్స్
‘పుష్ప 2’లో అల్లు అర్జున్ చీరకట్టులో కనిపించిన లుక్ గంగమ్మ జాతర సీక్వెన్స్‌లో భాగంగా ఉంటుంది. ఈ సీక్వెన్స్ సినిమాలో కేవలం గ్లామర్ లేదా యాక్షన్ కోసం కాకుండా కథలోనూ కీలక పాత్ర పోషించింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఇది ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ను మృగంలాంటి హైబ్రిడ్ రూపంలో చూపించారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.అంతేకాకుండా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. మరోవైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కలిసి తాత్కాలికంగా ఏఏ 23 (ఎల్కే 07) అనే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. దీనితో పాటు నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కూడా అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
