![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-12.jpg)
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను (Sreetej) పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలను ఆరా తీశారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా మాట్లాడారు. సుమారు 20 నిమిషాలు పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. గత నెల 4న సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. 35 రోజులుగా కిమ్స్ ఆస్పత్రి(KIMS Hospital)లోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు బాలుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చారు. పోలీసుల సూచనల మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అల్లు రాకతో కిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) కూడా ఆయన వెంట కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూసిన అల్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
……………………………..