ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్ టీమ్‌లో చర్చిస్తున్నారు. అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
