ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంథ్య థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టు(Nampalli Court)లో ఈరోజు విచారణ జరిగింది. అల్లు అర్జున్ (Allu Arjun) విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. తొలుత అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం తొలుత 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ గడువు ఈరోజుతో పూర్తి కావడంతో విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు నాంపల్లి కోర్టు వెల్లడించింది.
…………………………………………..