Published:
Updated: 28 Dec 2024 • 04:42 AM
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడిరచారు. కాగా, శుక్రవారం ఉదయం ఈ మార్గం గుండా వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి.. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు బ్లూ కలర్ ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
