* బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ టీం (ALLU ARJUN TEAM )స్పందించింది. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. జరిగిన ఘటన దురదృష్టకరం అని పేర్కొంది. త్వరలోనే తమ బృందం బాధిత కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందించనుందని ఆ టీమ్ ప్రకటించింది.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి
ఇదిలా ఉండగా.., సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కాంగ్రెస్ బహిష్కృత నాయకులు బక్క జడ్సన్ (BAKKA JUDSON) జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తొక్కిసలాటలో మహిళ మృతికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాత బాధ్యత వహించాలని ఆయన ఆ పిటిషన్ లో చెప్పారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు,
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
