* సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి
* పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్ ,రామగుండం : మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, మహిళల రక్షణ, భద్రత పోలీసు బాధ్యత లో భాగం అని పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో షీ టీమ్స్ స్కూల్స్, కళాశాలలు , ఇతర కార్యాలయాల వద్ద మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో కేసు, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య వచ్చినప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్య పరుస్తున్నామని వివరించారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, లేదా ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు. ఎవరైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన, మాట్లాడడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉండటం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత. పోలీసు శాఖ మీకు అండగా ఉంటుంది. మీ భద్రత కోసం 24 గంటలు సిద్ధంగా ఉన్నాం, తప్పు చేస్తున్న వారి మీద చర్య తీసుకోవడానికి మీ సమాచారమే వారిపై చట్ట పరమైన చర్యలకు ఆధారం అన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ గారు సూచించారు.
