* జగన్తో రఘురామకృష్ణంరాజు మాటామంతీ
ఆకేరు న్యూస్, అమరావతి : ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల (AP Assembly meeting) సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధినేత (YCP leader) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) ని తెలుగుదేశం నేత(TDP leader ), ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ( Undi MLA Raghuramakrishnam Raju) ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరి మధ్య కాసేపు మాటామంతీ చోటు చేసుకుంది. వారిద్దరి కలయికను అక్కడున్న వారంతా ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే.. ఎన్నికల ముందు నుంచీ జగన్ కు, త్రిబుల్ ఆర్కు మధ్య ఉప్పు-నిప్పులా వాతావరణం ఉండేది. తాజాగా ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఇదిలాఉండగా గవర్నర్ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) నల్లకండువాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగంపై నిరసన తెలిపారు. ఏపీలో దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఫ్లెక్సీలు పట్టుకుని అసెంబ్లీకి వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడమే కాకుండా, ఓ ఫ్లెక్సీని చింపేయడంపై పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
—————————