
ఆకేరున్యూస్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పలువురి యూట్యూబర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరవగా.. పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చినా ఆమె స్పందించలేదు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే క్వాష్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అలాగే సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉదయమే శ్యామల విచారణకు హాజరయ్యారు.
…………………………..