* అందెశ్రీ మృతి పట్ల ప్రొఫెసర్ సీతారాం నాయక్ దిగ్భ్రాంతి
ఆకేరు న్యూస్, హనుమకొండ : అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. అందెశ్రీ రచనలు తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవ స్ఫూర్తిని నింపాయని అన్నారు. ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడే అందెశ్రీ తనను ఓ సోదరుడిగా భావించేవాడని గుర్తుచేసుకున్నారు. తాను కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నప్పుడే అందెశ్రీకి డాక్టరేట్ ఇచ్చే అదృష్టం కలిగిందని పేర్కొన్నారు.తెలంగాణ సమాజం ప్రతిరోజూ ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ రాష్ట్ర గీతం రూపంలో ఆయనను ప్రతిరోజు స్మరిస్తుందని సీతారాం నాయక్ అన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీతారాం నాయక్ అన్నారు.
…………………………………………………
