* అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న ప్రాజెక్టు
* అప్పుడే 75 శాతం పూర్తి చేశాం..
* రాజకీయాలకు అనర్హుడైన ఓ వ్యక్తి వల్ల ఆగిపోయింది..
* పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం
* అనంతరం మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడి
ఆకేరు న్యూస్, విజయవాడ : పోలవరం ప్రాజెక్టు(Polavaram project) అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(AP CM Chandrababu Naidu) తెలిపారు. గతంలో సీఎంగా ప్రమాణానికి ముందే 7 మండలాలను ఏపీలో కలపాలని ఒత్తిడి తెచ్చానని, అందువల్లే ఆ పని జరిగిందని వెల్లడించారు. ఏడు మండలాలను కలిపాం కాబట్టే పోలవరం కట్టగలిగామన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..తొలిసారి నారా చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం పేరుతో .. చంద్రబాబు నిర్మాణ పనులపై ప్రతీ సోమవారం సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే విధంగా సోమవారం రోజే చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. ప్రాజెక్టు పురోగతి విషయాలను క్షేత్రస్థాయిలోతెలుసుకోవడానికి పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం.. అధికారులను ప్రాజెక్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలవరం స్టేటస్ నివేదిక ప్రకారం… మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో 50శాతం కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు 49.79శాతం ప్రాజెక్ట్ మాత్రమే పూర్తయ్యింది. హెడ్ వర్క్స్ పనులు 72.63శాతం పూర్తవగా.. కుడి కాలువ పనులు 92.75శాతం పూర్తవగా.. ఎడమ కాలువ పనులు 73.07శాతం వరకూ పూర్తయ్యాయి. భూసేకరణ-పునరావాసం పనులు 22.55 శాతం మాత్రమే జరిగినట్లు రిపోర్డ్ చెబుతోంది. ఇక, అప్రోచ్ ఛానెల్ పనులు 79 శాతం పూర్తి అయ్యాయి. ఇక మస్పిల్వే పనులు 88 శాతం వరకూ పూర్తవగా .. పైలెట్ ఛానెల్ పనులు 48శాతం,అలాగే రైట్-లెఫ్ట్ కనెక్టివిటీ పనులు 68శాతం పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌లో మూడు గ్యాప్స్ ఉండగా..గ్యాప్1 మరియు గ్యాప్2లో డయాఫ్రమ్ వాల్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. రెండు చోట్ల ఇంకా నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు. ఇక, గ్యాప్3 లో అయితే కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది.
ముందుగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెలికాప్టర్(Helicopter) ద్వారా మొత్తం ప్రాజెక్ట్‌ను ఏరియల్ వ్యూ (Aerial view) ద్వారా చూసాక… ఆ తర్వాత ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లి నేరుగా పరిశీలించారు. స్పిల్‌వే, గైడ్‌బండ్, గ్యాప్1, గ్యాప్2, గ్యాప్3 నిర్మాణాలు,ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్‌తో పాటు పవర్ హౌస్(Power House) ను చంద్రబాబు స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టును 75 శాతం పూర్తి చేశామని, రాజకీయాలకు అనర్హుడైన ఓ వ్యక్తి వల్ల అభివృద్ధి ఆగిపోయిందని జగన్ (Jagan)ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
—————————