BJP chief Annamalai Resignation from BJP
* అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
* మార్పు కోసం బీజేపీలో చేరా
* సమాజంలో మార్పు తేవాలని భావించాను
* రాజకీయాల్లోకి వచ్చేముందు రజనీకాంత్ సలహాలు తీసుకున్నా
* కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా
* తమిళ ఐడెంటిటీని వదులుకోను, ప్రజలతో కలిసి ముందుకు సాగుతా – అన్నామలై
ఆకేరు న్యూస్, డెస్క్:తమిళనాడు రాజకీయాల్లో అన్నమలై రాజీనామా ఆ రాష్ట్ర బిజెపి శ్రేణులను కలవరానికి గురిచేసింది. ఒక్కసారిగా వెలుగు వెలిగిన ఆ నేత పార్టీకి రాజీనామా చెయ్యడం ఏంటి అనే చర్చ నడుస్తుంది.తమిళ రాజకీయాల్లో కాషాయ పార్టీ (బీజేపీ ) కి బిగ్ షాక్ తగిలింది.అన్నామలై రాజీనామాను ఆమోదించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.
తమిళ రాజకీయాల్లో కమలం పార్టీకి సరికొత్త ఊపు తెచ్చిన ఫైర్‌బ్రాండ్ అన్నామలై తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది.
* అతి తక్కువ కాలంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక
ఆయన రాజీనామాను అధిష్టానం సైతం ఆమోదం తెలిపింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనపై నమ్మకంతో అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
* డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా అన్నామలై పోరాటం..
నా భూమి, నా ప్రజలు పాదయాత్ర తమిళనాడులో బీజేపీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార డీఎంకే అవినీతిపై డీఎంకే ఫైల్స్ పేరుతో ఆయన చేసిన ఆరోపణలు, మీడియా ముందు అయన చూపించిన విధానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్నా.. బీజేపీ హైకమాండ్ మాత్రం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా పళనస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితమైంది.
* పాత కొత్త నేతలకు కుదరని రాజకీయ పొంతనలు
తమిళనాడు బీజేపీలోని బిజెపిలోని పాత నేతలకు అన్నమలైకి పడడం లేదని చర్చ సాగుతుంది.ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.రాజీనామాకు ముందు అన్నామలైతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలు చర్చించిన తర్వాతే అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై ఉన్నారు. గతంలో డీఎంకే అవినీతిని ఎండగట్టిన ఆయన.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు.అందుకే బీజేపీ కి రాజీనామా చేసారు అనే చర్చ సాగుతుంది.ఏది ఏమైన అన్నామలై బీజేపీని వీడడం ఆ పార్టీకి తీవ్ర నష్టం అనే చర్చ సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
