Hanamkonda Ajara Hospital Negligence
అకేరు న్యూస్, హన్మకొండ: హనుమకొండ అజార ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. హనుమకొండ పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(24) పురిటి నొప్పులతో అజర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం అడ్మిట్ అవ్వగా.. సరైన వైద్యం చేయకపోగా కడుపులో బిడ్డతో పాటు.. ఆ మహిళ గర్భసంచిని కూడా కోల్పోవడంతో… వారి కుటుంబీకులు ఆగ్రహించి అజర ఆసుపత్రి యాజమాన్యంతో ఆందోళనలకు దిగారు.
పురిటి నొప్పులని వస్తే 24 ఏళ్ల మహిళకు గర్భసంచి లేకుండా చేసి తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. పేద ప్రజలను పట్టిపీడిస్తున్న అజర ప్రైవేట్ ఆసుపత్రి పై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు.. జిల్లా వైద్యశాఖ అధికారి వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
