
* కేటీఆర్, కవితలపై గురువారెడ్డి ఆరోపణ
* హెచ్సీఏ అక్రమాలపై విచారణ జరిపించాలి
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కేటీఆర్ కవితలు క్రికెట్ వ్యవస్థను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. వీరిద్దరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ స్థాయిలో క్రికెట్ పూర్తిగా దెబ్బ తిన్నదన్నారు. ఇందులో హెచ్సీఏ ఎన్నికల అధికారి సంపత్ కుమార్ ప్రమేయం కూడా ఉందన్నారు. ఉచితంగా నిర్వహించాల్సిన సమ్మర్ క్యాంపుల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.తెలంగాణ నుంచి ఏడాదికి ఒక క్రికెటర్ ను తయారు చేసే అవకాశమున్నా చేయలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ సీఏ కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేసి హెచ్ సీ ఏ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హెచ్ సీఏ అక్రమాలను సీఐడీ , ఈడీలకు అందజేస్తామని గురువా రెడ్డి తెలిపారు. హెచ్ సీఏలో ఇప్పటి వరకు 170 కోట్ల గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు.
……………………………