
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమురయ్య, కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డిని ఎంపిక చేసినట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు.
……………………………………………………