ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Race Case) కేసులో నిందితులను ఏసీబీ వరుసగా ప్రశ్నిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్(ktr), ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvindkumar)ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డి (Bln Reddy)ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు 6 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలతో పాటు రేస్ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్ ఎండీఏ(HMDA) ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలిసింది.
……………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
