* టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం
* పర్యాటక శాఖ ద్వారా దర్శనం టిక్కెట్లు కూడా రద్దు
* వివరాలు వెల్లడిరచిన టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి
ఆకేరున్యూస్, తిరుమల: టీటీడీ (TTD) పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను కేటాయించే పద్దతిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తితిదే (TTD) నిర్ణయించింది. తితిదేలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు (BR NAIDU) మీడియాకు వెల్లడిరచారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డు లోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్నారు.
తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామని, శారదా పీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని ఛైర్మన్ తెలిపారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిసామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ప్రకటన జారీ చేశారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. స్థానికులకు శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుందన్నారు. స్వామివారికి చెందిన నగదును ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్లు నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేసేలా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించిందని.. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
………………………………………….