
* గంగాహారతి ఘాట్ వద్ద వేద విద్యార్థి మృతదేహం
* మృతిపై అనుమానాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బాసరలో మరో దారుణం చోటుచేసుకుంది. వేద విద్యార్థి మణికంఠ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. గంగాహారతి ఘాట్ (Ganga Harathi Ghat) దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతుడు నిజామాబాద్ జిల్లా వర్నివాసిగా గుర్తించారు. మణికంట వేదపాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత నెల 21న వేది విద్యార్థిపై దాడి జరిగింది. ఆ ఘటన మరువక ముందే మణికంఠ మృతి చెందడం కలకలం రేపుతోంది. కాగా వేద పాఠశాల(Vedic School)లో సీసీ ఫుటేజీ మాయం కావడం సంచలనంగా మారింది. దీంతో వేద పాఠశాల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
………………………………………………..