![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/images-13.jpg)
* మల్లు భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ఈ నెల 16-28 మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కుల గణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్చి మొదటివారంలో క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదించేలా కృషి చేసామన్నారు.రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి.
…………………………………..