
* పరిశీలనలో ఆర్ఎస్ ఎస్ వాది శేషాద్రిచారి పేర్ల పరిశీలన?
ఆకేరు న్యూస్ డెస్క్ : సెప్టెంబర్ 9వ తేదిన నిర్వహించబోయే ఉప రాష్ట్రపతి పోరులో నిలిచే అభ్యర్థులపై ఎంపికపై ఉత్కంఠత నెలకొంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడునే మళ్లీ ఆ పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో వెంకయ్యనాయుడు అనుభవమే పనికొస్తుందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆర్ఎస్ ఎస్ వాది శేషాద్రిచారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతలంతా సమావేశమై అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు కమిటీ ఎన్డీఎ తరపున అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆదివారం సాయంత్రం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎన్ డీ ఏ తరపున నిలిచే అభ్యర్థిపై, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా పాల్గొని ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
……………………………………….