ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Graduate MLC by election) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ గౌడన్స్లో లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. నాలుగు హాళ్లలో మెత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని(Postal Ballot Votes) కలిపి లెక్కిస్తున్నారు. బరిలో 52 మంది అభ్యర్ధులున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839కి గానూ.. 3,36,013 ఓట్లు పోలయ్యాయి. అంటే 72.44% ఓటింగ్ జరిగింది. ఫలితం తేలేంత వరకూ కౌటింగ్ నిర్వహించనున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో 24 గంటల పాటు.. రెండు రోజులూ కొనసాగే అవకావం ఉంది.
షిప్ట్ కు 900 మంది
బుధవారం ఉదయం మొదట 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేసే ప్రక్రియను కౌంటింగ్ సిబ్బంది మొదలు పెట్టారు. చెల్లుబాటైన ఓట్ల లెక్కింపులో సగంకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు మార్క్ గా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు మార్క్ ను ఎవరు రీచ్ కాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అభ్యర్ధులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌంటింగ్ జరగనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే ఫలితం రేపు వెలువడే అవకాశం ఉంది. ఒక్కో షిప్ట్ లో 900 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం మూడు వేల మంది సిబ్బంది ఎమ్మెల్సీ బ్యాలెట్ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు.
————————