
* ఇద్దరు జవానులూ మృతి
* బీజాపూర్ లో కొనసాగుతున్న కాల్పులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో (Firing)31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవానులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కులో ఈ కాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల ఏరివేతకు డీఆర్ జీ(Drg), ఎస్టీఎఫ్ (StF)దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతి చెందిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కాల్పులపై బస్తర్ ఐజీ పి.సుందర్ రాజు స్పందించారు. 31 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
……………………………………………