ఆకేరు న్యూస్ డెస్క్ :
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), జార్ఖండ్ (Jharkhand) ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఈరోజు జార్ఖండ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ (A huge Encounter)జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు(Maoists) హతమయ్యారు. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లా (Singhbhum district) లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో నలుగురు మావోయిస్టులు(Four Maoists were killed)మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్ శేఖర్(SP Ashutosh Shekhar) చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. ఇదిలాఉండగా, శనివారం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు (Eight Maoists were killed)చనిపోయిన విషయం తెలిసిందే. నారాయణ్‌పూర్, కొండగావ్, కాంకేర్, దంతేవాడ డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్, బీఎస్ఎఫ్ 135వ బెటాలియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
———————–