ఆకేరున్యూస్, సింగరేణి : పర్యావరణహిత, సుస్థిర మైనింగ్‌తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు దక్కింది. భారత దేశం, దక్షిణాసియాలో సుస్థిర ఇంధన, పునరుద్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంస్థలను ఎనర్షియా ఫౌండేషన్ ప్రతీ ఏడాది పురస్కారాలను అందజేస్తుంది. ఈ సంవత్సరం ‘ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టేనబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్’ కేటగిరీలో సింగరేణిని అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేసినందుకు గాను సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 20న విశాఖపట్నంలో అవార్డుల ప్రదానం జరుగనుందని అవార్డు కమిటీ జ్యూరీ కన్వీనర్ ఆర్.త్యాగరాజన్ అయ్యర్ పేర్కొన్నారు.
………………………………….