
* మధ్యంతర బెయిలు రద్దు చేయాలని పోలీసుల పిటిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిలుపై ఉన్న జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిలు రద్దు కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేశారు. కొద్ది రోజులుగా జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి రేపు ఢిల్లీలో అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డు కమిటీ అవార్డు కమిటీ అవార్డును కేన్సిల్ చేసింది. ఇదిలాఉండగా, మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ నార్సింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు న్యాయస్థానం బెయిలు రద్దు చేస్తుందా, లేదా అనేది చూడాలి. కాగా ఎల్లుండితో జానీ మాస్టర్ మధ్యంతర బెయిలు గడువు ముగియనుంది.
………………………………………