
* 49 మంది మృతి?
* అదృశ్యమైన అంగారా విమానం.. ప్రమాదంలో కుప్పకూలి..
ఆకేరు న్యూస్, డెస్క్: రష్యాలోని అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనా సరిహద్దు ప్రాంతంలో కుప్పకూలింది. టిండా నగరానికి వెళ్తుండగా ఏఎన్ 24 ఎయిర్ క్రాఫ్ట్ ఏటీసీతో కాంటాక్ట్ కట్ అయింది. రష్యాలోని అమూర్ ప్రాంతంలో విమానం అదృశ్యమైంది. అది ఏమైందో అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంగా ఘోరం జరిగినట్లు గుర్తించారు. విమానం కుప్పకూలిన శకలాలను అధికారులు కొనుగొన్నారు. విమానంలో మొత్తం 49 మంది దుర్మరణం చెందినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వీరిలో 43 మంది ప్రయాణికులు కాగా మిగిలిన ఆరుగురు సిబ్బంది. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానంతరం అంగారా ఎయిర్‌లైన్స్ తమ టిండా మార్గంలోని అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. మృతుల దేహాలు వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది.ఈ ఘటనపై రష్యా విమానయాన శాఖ అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలు లేదా మానవ తప్పిదం వంటి కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
………………………………………………………