
* విద్యుత్ స్తంభం మీదపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ రెండు నెలల కాలంలోనే హైదరాబాద్ లో విద్యుత్ తీగల వల్ల మృతి చెందిన సంఘటనలు నాలుగు సార్లు చోటుచేసుకున్నా యి.శ్రీ కృష్ణామి సందర్భంగా రామంతాపూర్ లో భక్తులు రథం లాగుతుండగా విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆ తరువాత పాతబస్తీలో వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆ తరువాత సికింద్రాబాద్ లోని తిరుమలగిరి ప్రాంతంలో ఓ శుభకార్యానికి వేసిన పందిరిని తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మంగళవారం ఉదయం నాచారం పరిధిలో సాత్విక్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ బైక్ వెళ్తుండగా డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగి మీద పడడంతో సాత్విక్ అక్కడిక్కడే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………….