* నవీన్ యాదవ్‌కు ఇచ్చే యోజనలో సర్కార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహీరో నవీన్ యాదవ్‌కు విప్ దక్కనుంది. సీఎం రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. అన్నీతానై.. రేవంత్ ముందుండి విజయ తీరానికి నడిపించారు. అదే ఊపుతో గ్రేటర్లో మరింత పట్టు సాధించేందుకు నవీన్ యాదవ్‌కు విప్ కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలకు ముందే హైదరాబాద్ నుంచి అజారొద్ధీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గ్రేటర్లో మరింత పట్టసాధించేందుకు నవీన్‌యాదవ్‌కు విప్ దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించే వీలుడడంతో.. బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
……………………………………………………
