KTR | రెవెన్యూ మంత్రి ఇంట్లో ఈడీ దాడుల వివరాలేవీ?
* ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ప్రశ్నలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎక్స్ వేదికగా అధికార పార్టీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR).. రెవెన్యూ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు అంటూ ఆసక్తికర చర్చతెరపైకి తెచ్చారు. దాడుల వివరాలపై గోప్యత ఎందుకని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి (REVENUE MINISTER)ఇంట్లో ఈడీ దాడుల వివరాలేవీ? ఆ దాడుల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటూ ట్వీట్ చేశారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కనీసం ఈడీ అధికారుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. ఆ రోజు నోట్ల లెక్కింపు కోసం వాడిన రెండు కౌంటింగ్ మెషిన్లు ఏమయ్యాయని నిలదీశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(PONGULETI SRINIVASREDDY) నివాసంతోపాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐటీ దాడులు జరిగి 2 నెలలైనా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంపై కేటీఆర్ ప్రశ్నించారు.
……………………………………