– అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు
– ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
– నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలబడింది.. అంటూ టీడీపీ ఎమ్మెల్యేల ప్లకార్డుల ప్రదర్శన
ఆకేరు న్యూస్, విజయవాడ :
తెలుగుదేశం(TDP) అధినేత చంద్రబాబునాయుడి(Chandrababu Naidu) శపథం నెరవేరింది. ముఖ్యమంత్రి(Chief Minister) గానే శాసనసభ(Legislature) లో అడుగుపెట్టారు. ‘ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. నేను ఎనిమిదోసారి ఈ సభ (Assembly) లో ఎమ్మెల్యే(MLA)గా ఉన్నాను. గౌరవం ఇవ్వని ఈ సభలో నేను కొనసాగలేను. ఈ సభకు ఒక నమస్కారం. సంస్కారం లేని వ్యక్తుల మధ్య నా గౌరవాన్ని పోగొట్టుకోలేను. ఈ కౌరవ సభ నుంచి వెళ్లిపోతున్నాను. మళ్లీ ముఖ్యమంత్రి (Chief Minister) గానే ఈ సభలో అడుగు పెడతాను’ అంటూ 2021 నవంబరు 21న శాసనసభ నుంచి బయటకు వెళ్లిన చంద్రబాబు. ఆ తర్వాత సమావేశాలకు హాజరుకాలేదు. రెండున్నరేళ్ల(Two and a half years) క్రితం నిండు సభ (Assembly)లో జరిగిన అవమానంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
ఆరోజున ఏం జరిగిందంటే..
ఆ రోజున వ్యవసాయ అంశాల మీద ప్రారంభమైన చర్చ అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు కుటుంబ సభ్యుల మీదకు మళ్లింది. మంత్రులు అంబటి రాంబాబు(Ambati Rambabu), కొడాలి నాని(Kodali Nani) చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనితో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన లేచి నిలబడి మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో మైక్ లేకుండానే చంద్రబాబు మాట్లాడారు. సభ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. తన జీవితంలో మొదటిసారి బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకొన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా నీచంగా సభలో అవమానించారని, అనరాని మాటలు అన్నారని… అటువంటి సభలో తాను ఉండదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ శాసనసభలో అడుగు పెట్టలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో కొనసాగారు. ఆయన చేసిన శపథానికి రాష్ట్ర ప్రజల మద్దతు లభించింది. తిరుగులేని ప్రజా మద్దతుతో ఆయన మళ్లీ శాసనసభలో అడుగుపెట్టారు.
అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి..
బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి వచ్చిన చంద్రబాబునాయుడు అసెంబ్లీ (Assembly) కి మెట్లకు ప్రణమిల్లి.. లోనికి అడుగుపెట్టారు. వేదపండితులు ఆయనకు మంత్రోచ్చరణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP Chief Minister Chandrababu Naidu) ప్రమాణం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan), ఆ వెంటనే వరుసగా 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో పెట్టగానే.. నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలబడింది.. అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.
—————————-