వరద ప్రాంతాలను పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన రైలు
ఆకేరున్యూస్, విజయవాడ: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అనుకోని సంఘటన ఎదురైంది. మధురానగర్ వద్ద బుడమేరును పరిశీలించేందుకు చంద్రబాబు కాలినడకన రైల్వే వంతెనపై నడిచి వెళ్లారు. ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగానే ఓ రైలు ఎదురుగా వచ్చింది. గమనించిన ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అప్రమత్తం చేశారు. రైలు తగలకుండా సీఎం చంద్రబాబు పక్కకు నిలబడడంతో ప్రమాదం తప్పింది. బాబుకు అతి సమీపంలో నుంచి రైలు వెళ్లింది.