* 18 కంటే తక్కువ సీట్లలో లీడింగ్
* పలు జిల్లాల్లో స్వీప్ చేస్తున్న కూటమి
* ఎగ్జిట్ పోల్స్ కు మించిన విజయం
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి(YCP) ఘోరా పరాభవం దిశగా ఫలితాల సరళి కనిపిస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కనిపిస్తోంది. సీఎం సొంత జిల్లాలోనూ వైసీపీకి కూటమి గట్టి పోటీ ఇస్తోంది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో తెలుగుదేశం(TDP) కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ పరిణామాలన్నీ ఏపీలో ప్రస్తుత అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం 160 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కనిపిస్తున్నారు. 82 స్థానాలు ఉన్న రాయలసీమ జిల్లాల్లో కూడా కేవలం నాలుగు స్థానాల్లోనే ప్రస్తుతం వైసీపీ విజయం దిశగా వెళ్తోంది. ఇక ముఖ్యమంత్రి జగన్( CM Jagan) మినహా.. మంత్రులు అందరూ వెనుకంజలోనే ఉన్నారు. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజాకు ఓటమికి తప్పేలా లేదు. వైసీపీ కీలక మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల గెలుపు సైతం అనుమానమే అన్నట్లుగా ప్రస్తుతం ఫలితాల సరళి కనిపిస్తోంది.
———————