రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం
* చంద్రబాబుకు మించిన మెజార్టీ!
* రాజమండ్రి రూరల్ నుంచి హ్యాట్రిక్
ఆకేరు న్యూస్, రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) తొలి విజయం అందుకున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ప్రస్తుతం 50వేలకు పైగా ఆధిక్యత సాధించారు. అప్పటి కుప్పంల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) 13 వేల మెజార్టీలో ఉన్నారు. ఆయనకు మించిన మెజార్టీలో గోరంట్ల రికార్డు దిశగా ముందంజలో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పుట్టుక నుంచి అందులోనే ఉన్నారు. టీడీపీ(TDP) పునాదుల నుంచి ఉన్న సీనియర్ నేతలలో ఆయన ఒకరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్(NTR) మెచ్చిన నేత. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్ లో కొన్నాళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు. తొలిసారి ఆయన 1983లో టీడీపీ తరఫున రాజమండ్రిలో గెలిచారు. అలాగే 1985లో రెండోసారి జయభేరీ మోగించారు. 1989లో తొలిసారి ఓటమి పాలు అయినా 1994, 1999లలో రెండు సార్లు గెలిచి సత్తా చాటారు. ఇక 2004, 2009లలో ఓడారు. అయితే 2014, 2019లలో రాజమండ్రి రూరల్ నుంచి గెలిచి సత్తా చాటారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
