* ఇంత సంక్లిష్టంగా ప్రశ్నలు దేనికి
* యాప్ రూపొందిస్తే సులువయ్యేది
* సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కులగణన వివాదం కాకుండా సులభతరం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI NARAYANA) స్పందించారు. కానీ దీనికి 75 ప్రశ్నలు అవసరమా? అని ప్రశ్నించారు. యాప్ రూపొందిస్తే ఎవరి ఫామ్ వాళ్లే పూర్తి చేస్తారన్నారు. వ్యక్తిగత ఆస్తులు, అప్పులు, బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వానికి ఎందుకన్నారు. అయితే గణన ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రోత్సహించవచ్చని సూచించారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు ఆవేదనతో దాడి చేశారని.. తమ భూములు పోతాయనే ఆవేదనతోనే వారు అధికారులను అడ్డుకున్నారన్నారు. ఇకపోతే రాజకీయాల్లో దుష్ట సంస్కృతిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు. జమిలి ఎన్నికలపై ఉన్న దృష్టి దేశ సమస్యలపై లేదన్నారు. ధరలు, నిరుద్యోగంపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. జమిలి కోసమే మహారాష్ట్ర, రaార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లో గెలిస్తే జమిలి ఎన్నికల దిశగా వెళ్లాలని మోదీ చూస్తున్నారన్నారు. ఆ ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని చెప్పారు. మహారాష్ట్రలో కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తున్నామని.. రaార్ఖండ్లో ఒంటరిగా బరిలో నిలిచామని నారాయణ తెలిపారు.
……………………………………………………