
* భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల చర్యలు
* నిషధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడి
ఆకేరు న్యూస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, వరంగల్ (Warangal)జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు కాలనీలకు వరద పోటెత్తింది. రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. వరద కారణంగా ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా వర్షాలకు జలపాతాలు కళకళలాడుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాజేడు మండలం వద్ద ఉధృతంగా బొగత జలపాతం (Bogata Waterfalls) వరద పరవళ్లు తొక్కుతున్నది. కనులవిందు చేస్తోంది. దీంతో పలువురు సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు.భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.
……………………………………………