
* హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. మీ సమర్థన? అభివృద్ధా? ప్రభుత్వ భూమా? మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా?! మీరు ఎన్నికైన ప్రతినిధినా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా?! అంటూ ప్రశ్నించారు. విధ్వంసం మీ ఏకైక నినాదం! మీ ఖజానాను దాఖలు చేయడమే ఏకైక నినాదం! నేను మిమ్మల్ని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి(REVANTHREDDY).. మీ బుల్డోజర్లు వారాంతంలో, రాత్రిపూట ఎందుకు నిరంతరాయంగా పనిచేశాయి? మీరు కోర్టుకు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏమి దాచారు? అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు చదును చేస్తుండడంతో అక్కడి అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జింకలు గుమిగూడడంపై అక్కడ ఏం జరుగుతుందో తెలియక అవి ఆగమాగం అవుతున్నాయన్నారు.
………………………………………………