* డీజీపీ, వరంగల్ సీపీ ని ఆదేశించిన హైకోర్ట్
ఆకేరు న్యూస్ , వరంగల్ :
మాజీ ఎమ్మెల్యే , వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు హైకోర్ట్‌లో ఊరట లభించింది. తనకు కెటాయించిన గన్ మెన్ లను అకారణంగా ప్రభుత్వం తొలగించారని హైకోర్ట్‌ను ఆశ్రయించారు. గతంలో తనకు 3 + 3 గన్ మెన్ ల రక్షణ ఉండేదని , ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు చేసిన తనకు భద్రత ఎంతో అవసరమని కోర్టుకు తెలిపారు. దీంతో ఆరూరి రమేశ్ కు 1+1 గన్ మెన్ ల సౌకర్యం కల్పించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా లను హైకోర్ట్ ఆదేశించింది.
—————————