* జమ్మూకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు ఇలా..
ఆకేరు న్యూస్ డెస్క్ : జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో కేంద్రం భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. ఇటీవలి వరుస ఉగ్రఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్ ల రాకపోకలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 2019 ఆగస్టును 5న 370 ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేసింది. దీనిపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ ఆర్టికల్ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ..శాశ్వతం కాదని కోర్టు తేల్చిచెప్పింది. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమని స్పష్టచేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో చాలా మార్పులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఉగ్రవాద ఘటనలు తగ్గాయి. స్థానిక అల్లర్లు తగ్గాయి. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. అమాయకుల హత్యలపై కూడా నిషేధం ఉంది. పౌర మరణాలు 81 శాతం తగ్గినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది జూలై 21 వరకు మొత్తం 14 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారు. అయితే 2023లో యూనియన్ టెరిటరీలో 46 ఉగ్రవాద సంఘటనలుచ 48 ఎన్కౌంటర్లు లేదా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మరణించిన వారి సంఖ్య 44. ఇందులో 30 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు ఉన్నారు. రాష్ట్రంలో 70 శాతం ఉగ్రవాద ఘటనలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
——————————————