* 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
ఆకేరు న్యూస్, శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇన్ ఫ్లో పెరుగుతోంది. నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈనేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కొన్నింటిని ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి సాగర్‌లోకి భారీగా వరద పోటెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 580 అడుగులు దాటింది. దీంతో.. 6 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
———————————