
* తెరకెక్కించనున్న బాలీవుడ్ దర్శకుడు నింబావత్
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్ ( MEGHALAYA HANEEMOON MURDER) ఇప్పడు సినిమాగా రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు నింబావత్ ( DIRECTOR SP NIMBHAVATH) మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్‌ను హనీమూన్ ఉన్ షిల్లాంగ్ (SHILLANG) పేరుతో తెరకెక్కించనున్నట్ల ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజా రఘువంశీ సోదరుడు సచిన్ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది.
అసలు కేస్ ఏంటి..
రాజా రఘవంశీ,సోనమ్ లు ఇద్దరూ పెళ్లి చేసుకొని హనీమూన్ కని మేఘాలయ వెళ్లారు. మేఘాలయ వెళ్లిన ఈ నవదంపతుల్లో రాజా రఘవంశీ శవమై కన్పించాడు. వివరాల్లోకి వెళితే రాజా రఘువంశీ,( RAJA RAGHU VAMSHI) సోనమ్ ( SONAM)లు ఇద్దరూ మే నెల 11న పెళ్లి చేసుకున్నారు. సరదాగా హనీ మూన్ గడపుదామని మే 20న మేఘాలయకు వెళ్లారు. అక్కడు ఓ హోటల్ లో బస చేశారు. షిల్లాంగ్ లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు స్కూటీపై వెళ్లారు. స్కూటీపై వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. స్కూటీపై వెళ్లిన 11 రోజుల తరువాత జూన్ రెండున రాజా రఘువంశీ ఓ లోయలో శవమై కన్పించాడు. అతడి శరీరం సగం కుళ్లి పోయింది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరో కాదు భార్య సోనమ్. రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేని సోనమ్ పెద్దల బలవంతం మీద రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. అంతకు మందే ఆమె రాజ్ కుష్వాహ ( RAJ KUSHWAHA)అనే అతడితో ప్రేమలో ఉంది. ఈ నేపధ్యంలో పథకం ప్రకారం రాజా రఘువంశీని హనీమూన్ కు తీసుకువచ్చి ప్రియుడితో కలిసి హత్య చేసింది. విశేషం ఏంటంటే సోనమ్ తో కలిసి రాజా రఘువంశీని హత్య చేసిన రాజ్ కుష్వాహ ఏమీ ఎరగనట్లు రాజా రఘువంశీ అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఆ తరువాత పోలీసుల దర్యాప్తులో మొత్తం బయటపడింది.
……………………………………………………….