
* సమావేశం ముందుకు కులగణన నివేదిక
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుండగా… కులగణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భేటీలో ఉత్తమ్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈ నెల 5న మంత్రివర్గం ముందుకు కులగణన నివేదిక వస్తుందని తెలిపారు. కేబినెట్ ఆమోదం అనంతరం అసెంబ్లీ ముందుకు కులగణన నివేదిక తీసుకువస్తామన్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని.. ఈ సమావేశంలో కుల గణన నివేదికను ప్రవేశపెడుతామన్నారు.
…………………………………………….