
* ఆరుగురు బాలురపై లైంగిక దాడి
* పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాలుడి తల్లి
* పర్యవేక్షకుడిని విచారిస్తున్న పోలీసులు
ఆకేరున్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని సైదాబాద్ జువైనల్ హోంలో దారుణం జరిగింది. పర్యవేక్షకుడే ఆరుగురు బాలురపైలైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దసరా సెలవులకు ఇంటికి పోయిన ఓ బాలుడు తిరిగి జువైనల్ హోంకు రావడానికి నిరాకరించాడు. జువైనల్ హోంలో తనపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలుడి తల్లి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఆరుగురు బాలుర కు వైద్య పరీక్షలు జరుపడంతో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా… ఎంతకాలంగా అబ్జర్వేషన్ హోంలో మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జువైనల్ హోంలో లైంగిక దాడి ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయ్యింది.
…………………………………………………………