
* ప్రియుడిని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
ఆకేరు న్యూస్, వరంగల్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్య చెవులు కోసింది. ఏకంగా ప్రాణాలు తీసేందుకు స్కెచ్ వేసింది. భర్త పై కత్తితో విచక్షణా రహితంగా భార్య, ప్రియుడు కలిసి దాడి చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ పట్టణం శివారు ప్రాంతం గడ్డి గూడెం తండాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ శివారు ప్రాంతం గడ్డి గూడెంకు చెందిన ప్రసాద్ కు ఆరు సంవత్సరాల క్రితం రష్మిత అనే యువతితో వివాహం అయింది . వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంత కాలం క్రితం కొత్తగూడెం మండలం మర్రి గూడెం గ్రామానికి చెందిన అనిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబందానికి దారి తీసింది. దీంతో తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తపై ప్రియుడు అనిల్ తో కలిసి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. . దీంతో ఆయన శరీరంలోని ఇతర భాగాలతో పాటు చెవులకు తీవ్ర గాయాలయినాయి. పారి పోతున్న ప్రియుడిని స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మహబూబాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
————————————-